Sunday, April 28, 2024

విజృంభిస్తున్న కరోనా వైరస్‌, వందల్లో రోజువారీ కేసులు నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లి పెరుగుతున్నా ప్రజలు వైరస్‌ను లైట్‌గా తీసుకుంటున్నారన్న ఆందోళన వైద్య, ఆరోగ్యశాఖలో వ్యక్తమవుతోంది. రోజువారీ కేసులు ఇప్పుడు 1000కి చేరువలో నమోదవుతున్నా ప్రజలు కరోనా టెస్టులు చేయించుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. జ్వరం, దగ్గు, నీరసం వంటి కరోనా లక్షణాలు బహిర్గతమైనా కూడా కరోనా టెస్టు మాత్రం చేయించుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్‌ -మల్కాజిగిరి జిల్లాల్లో ప్రతీ రోజూ 500 దాకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమేనని, క్షేత్రస్థాయిలో వాస్తవానికి కనీసం అయిదు రెట్లు అధికంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌ పరిసర జిల్లాలతోపాటు నల్గొండ, కరీంనగర్‌, ఖమ్మం, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ రోజువారీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.

స్తుతం కరోనా కేసులు పీక్‌ లెవల్‌కు చేరుకున్నా… చివరకు లక్షణాలు కనిపించినా కరోనా టెస్టులు మాత్రం చేయించుకోవడం లేదు. జ్వరం, జలుబు, దగ్గు తదితర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఇంట్లోనే డోల్‌-650, అజిత్రో మైసిన్‌ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులిద్దరికి వైరస్‌ సోకినా కూడా మిగతా కుటుంబ సభ్యులు టెస్టులు చేయించుకోవడం లేదు. కరోనా మొదటి, రెండు, మూడో వేవ్‌లు ఇలా ప్రతీవేవ్‌లోనూ హైదరాబాద్‌ నుంచే వైరస్‌ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వ్యాపిస్తోంది. అయినప్పటికీ హైదరాబాద్‌ ప్రజలు కూడా టెస్టింగ్‌ సెంటర్ల వైపు వెళ్లడం లేదని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేసుకున్నామన్న ధీమాతో జనం వైరస్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారని, ఈ పరిణామం సరికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టెస్టులు చేయించుకుని ఐసోలేషన్‌ పాటించకపోతే ఇంట్లోని వృద్ధులు, చిన్నారుల విషయంలో వైరస్‌ ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తాజాగా … తెలంగాణలో 440 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 28, 899 మందికి కరోనా టెస్టులు చేశారు. హైదరాబాద్‌లో 195, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 36, నల్గొండలో 18 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement