Sunday, April 28, 2024

Students Anxiety: అర్థ‌రాత్రి ఉమెన్స్ బాత్రుంలోకి చొర‌బ‌డ్డ ఆగంత‌కులు… రోడ్డు పై బైఠాయించిన విద్యార్థినీలు..

పీజీ లేడీస్ హాస్టల్ లోకి ఇద్ద‌రు వ్యక్తులు వెళ్లడం కలకలం రేపింది. సికింద్రాబాద్‌ బేగంపేటలోని మహిళా పీజీ కాలేజీ హాస్టల్ బాత్రూంలోకి శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఇద్దరు దండుగులు చొరబడ్డారు. ఇది గమనించిన విద్యార్ధులు.. ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంధించారు. మరో వ్యక్తి పరారయ్యాడు.

విద్యార్ధుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ది చేశారు. తమకు రక్షణ లేదంటూ విద్యార్థినులు కళాశాల గేట్లు మూసేసి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడ చేరుకొని వారిని వారించే ప్రయత్నం చేశారు. విద్యార్థునులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి త‌మకు సరైన రక్షణ లేదంటూ నిరనస వ్యక్తం చేశారు. పోలీసులు ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీంతో పీజీ ఉమెన్స్ ఉమెన్స్ కాలేజ్ క్యాంపస్ కి రిజిస్టార్ వచ్చారు. రిజిస్టార్కు వ్యతిరేకంగా విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు వీసీ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ కు నచ్చచెప్పేదుకు అధికారులు, పోలీసులు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. అయినా విద్యార్థినిలు ససేమిరా అంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉస్మాని యూనివర్సిటీకి చెడ్డ పేరు తెచ్చేలాగా అధికారులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గుడార్రాలాంటి హాస్టల్లో తాము నివసిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రక్షణ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి ఒకే ఒక్క ఫిమేల్ సెక్యూరిటీ గాడు ఉంటుందని, దీంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయని చెప్పినా.. అయినా యూనివర్సిటీ అధికారులు, కాలేజీ సిబ్బంది పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

- Advertisement -

ఇప్పటికైనా అధికారలు, పోలీసులు స్పందించాలని కోరుతున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆందోళన చేస్తున్నా ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడం దారుణమని మండిపడుతున్నారు. సరైన వసతులు లేవని ప్రధానోపాధ్యాయులు, రిజిస్ట్రార్ వినడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని, భద్రతా గోడలు చిన్నగా ఉండడం, సీసీ కెమెరాలు లేకపోవడంతో వాటి రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గతంలోనే హాస్టల్ వార్డెన్‌కు సూచించామని తెలిపారు. ఇప్పుడు హాస్టల్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారని.. ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని.. తమ సత్తా చాటుతామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement