Wednesday, May 1, 2024

TS : ఆర్​యూబీ నిర్మాణం…తార్నాక, మల్కాజిగిరి రూట్లలో ట్రాఫిక్ ​డైవర్షన్స్​

ఎంఎంటీఎస్​ ఫేజ్-2 ట్రాక్ పనులు, సీతాఫల్​మండి-, లాలాగూడ, -మెట్టుగూడ, ఆలుగడ్డ బావి రూట్​లో జరుగుతున్న ఆర్ యూబీ నిర్మాణ పనుల కారణంగా ఈ నెల10 నుంచి మే 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిటీ సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.తార్నాక -మెట్టుగూడ, మల్కాజిగిరి – -మెట్టుగూడ మార్గాల్లో డెవర్షన్స్​ఉంటాయని స్పష్టం చేశారు.

- Advertisement -

తార్నాక, లాలాపేట నుంచి సంగీత్​క్రాస్​రోడ్డు వైపు వెళ్లే వాహనదారులు తార్నాక- సీతాఫల్​మండి ఫ్లైఓవర్ నుంచి చిలకలగూడ ఎక్స్​రోడ్డు మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే మల్కాజిగిరి, మీర్చాలగూడ, లాలాగూడ నుంచి సికింద్రాబాద్​వచ్చే వాహనాలను తుకారాంగేట్​ఆర్​యూబీ, తుకారాంగేట్, వెస్ట్​మారేడుపల్లి సెయింట్​జాన్స్​రోటరీ మీదుగా సంగీత్​ క్రాస్​రోడ్స్, చిలకలగూడ క్రాస్​ రోడ్స్, సికింద్రాబాద్​వైపు మళ్లిస్తున్నట్లు చెప్పారు. నెల రోజుల పాటు డైవర్షన్స్​ కొనసాగుతాయని, వాహనదారులు సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement