Wednesday, May 1, 2024

Congress Vijaya Bheri – హైదరాబాద్ కు చేరుకున్న రాహుల్, ప్రియాంకా గాంధీ…

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ బుధవారం నాడు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకలకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్లో రాహుల్, ప్రియాంకలు ములుగు బయలుదేరారు. రామప్ప ఆల‌యంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన ఆరు గ్యారంటీ ప‌త్రాల‌కు పూజ‌లు చేయించనున్నారు.. అనంత‌రం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ బస్సు యాత్రకు రాహుల్ ,ప్రియాంకలు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు.. అక్క‌డ జ‌రిగే బహిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement