Sunday, May 5, 2024

Congress – మేమంతా అండగా ఉన్నాం.. అధైర్య పడొద్దు – బాల్ రాజ్ కు విహెచ్ ప‌రామ‌ర్శ‌

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)9: – బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ రాక పోవడంతో తీవ్ర మన స్థాపానికి గురై కాంగ్రెస్ నాయకులు కాసు ల బాలరాజ్ ఆత్మహత్యకు పాల్పడి నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆస్ప త్రిలో చికిత్స పొందుతు న్నారు. గురువారం రాజ్య సభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. వి.హనుమంతరావు చికిత్స పొందుతున్న కాసుల బాలరాజుని పరామర్శించారు. కొట్లాడి సాధించుకోవాలి… కానీ ఆత్మహత్య కు చేసుకోవడం ఎందుకని అని అన్నారు.ఈ సారి టికెట్ రాకుంటే మరోసారి టికెట్ వస్తుండే.. పదవులు ఎప్పుడు శాశ్వతం కాదని… అన్నారు. కాసుల బాలరాజుకు అందిస్తున్న వైద్యంపై వైద్యు లతో మాట్లాడారు. మేమంతా అండగా ఉన్నాము.. అధైర్య పడొద్దు అంటూ బాలరాజు కు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement