Thursday, April 25, 2024

TS CM: రేవంత్ రెడ్డితో సీనియర్ నేత వీహెచ్ భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు క‌లిశారు. మ‌రో కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వీహెచ్‌ పార్ల‌మెంట్ టికెట్ ఆశించారు. కానీ, టికెట్ త‌న‌కు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఆయన అల‌క‌బూనారు.

దీంతో గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఈ సీనియ‌ర్ నేత దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల మీడియా స‌మావేశంలోనూ ఆయ‌న బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే, ఇలా పార్టీకి దూరంగా ఉంటున్న వీహెచ్‌ను మ‌హేశ్ కుమార్ గౌడ్ బుజ్జ‌గించి సీఎం వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి.. వీహెచ్‌కు అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement