Sunday, April 28, 2024

Congress – రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నాప‌రామ‌ర్శించ‌ని కెసిఆర్ ను ఇంటికి పంపాల్సిందే – రేవంత్ రెడ్డి

కొడంగ‌ల్ – బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ దోచుకున్నారని విమర్శించారు టిపిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి. . తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని మోడీ.. గల్లీ కేసీఆర్ కలిసి త‌న‌పై కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నారన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్ పేట్, దుద్యాల్, కొత్తపల్లి జ‌రిగిన కార్నర్ మీటింగ్స్ లో మాట్లాడుతూ చింతమడకలో పుట్టిన కేసీఆర్… అక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఎందుకు పలకరించలేదని ప్రశ్నించారు .

మానవత్వం లేని వ్యక్తి మన రాష్ట్రానికి సీఎం అయితే మన బతుకులు బాగుపడతాయా.. అని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే అవినీతి సొమ్మును ప్రజల ఖాతాల్లో జమచేస్తామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోను సిద్ధం చేశామన్నారు.

త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ , “బీఆరెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.. మా హయాంలోనే బొంరాస్ పేట్ అభివృద్ధి చెందింది.. వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ పూర్తి చేస్తామన్న బీఆరెస్ హామీ నెరవేరలేదు.. కృష్ణా జలాలు తీసుకోస్తామని మోసం చేశారు… మాదనపూర్ నుంచి ఇక్కడ తండాలకు రోడ్లు వేయించింది నేను.. పదేళ్లలో ఈ ప్రాంతానికి కేసీఆర్ చేసిందేం లేదు.
మనీ, మద్యంతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. బంగారు తెలంగాణ సంగతేమో కానీ.. భార్య మెడలో బంగారం అమ్మే పరిస్థితి తెలంగాణలో దాపురించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల మొదటి తారీఖు రూ.2500 ఖాతాలో వేస్తాం. రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తాం..
మహిళలందరికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం..
రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తాం.
ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు సాయం అందిస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం.. చేయూత పథకం ద్వారా నెలకు రూ.4వేలు పెన్షన్ అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం” అంటూ వివ‌రించారు రేవంత్

.

Advertisement

తాజా వార్తలు

Advertisement