Monday, May 6, 2024

Manifesto – టి కాంగ్రెస్ సెంటిమెంట్ వ్యూహం – సెప్టెంబ‌ర్ 17న మేనిఫోస్టో రిలీజ్

హైదారాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రజలకు మరింత దగ్గరయ్యే క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ సెంటిమెంట్‌ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ప్రజల నాడిని గమణిస్తూ కార్యక్రమాల రూపకల్పన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడున్న జోష్‌ని ఎన్నికల దాకా కొనసాగింపునకు జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. నేతల మధ్య మరింత సమన్వయాన్ని పెంపొందించి ఎన్నికల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసే క్రమంలో అధిష్టానం పెద్దలను ఒప్పించి మెప్పించే దిశగా రాష్ట్ర నాయకత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దివోత్సవాన్ని పురస్కరించుకుని మేనిఫెస్టో విడుదలకు కసరత్తు చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ‘తెలంగాణ తల్లి’గా ప్రజల్లోకి వెళ్తూ, పార్టీ అధినాయకు రాలు సోనియాగాంధీ చేతుల మీదుగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయముంది. దీంతో ప్రధాన పార్టీలను వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

అంతేకాకుండా ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండేందుకు పక్కా ప్రణాళికలతో ముం దుకు సాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయముంది. దీంతో ప్రధాన పార్టీలను వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. మూడోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతుండంగా.. దానికి చెక్‌ పెట్టేందుకు ఓ వైపు కాంగ్రెస్‌, మరోవైపు బీజేపీ పలు ప్రణాళికలతో ముందుకుసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీ-కాంగ్రెస్‌ నిర్వహించిన ‘జనగర్జన’ సభ సక్సెస్‌ కావడంతో, అదే జోరును కొనసాగించాలని అధిష్టా నం భావిస్తోంది.

కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌, యూత్‌ డిక్లరేషన్‌ తర్వాత నిర్వహించిన జనగర్జన సభ పార్టీలో జోష్‌ పెంచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అదే జోష్‌ను మున్ముందు కొనసాగించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా డిసెంబర్‌లో జరిగే ఎన్నికలే టార్గెట్‌గా పార్టీ హామీలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. ఇక ఆలస్యం చేయకుండా మేనిఫెస్టోను కూడా విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. మేనిఫెస్టోకి తుది మెరుగులుదిద్ది ఫైనల్‌ చేయాలని పార్టీ హైకమాండ్‌ ఆదేశించినట్లు- గాంధీభవన్‌ వర్గాలు పేర్కొంటు-న్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement