Saturday, May 18, 2024

Congress Manifesto – హామీలు అమ‌లుకు కాంగ్రెస్ క‌స‌ర‌త్తు….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వచ్చే ఎన్నికల్లో అధికా రంలోకి వచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ హామీల జోరు పెంచింది. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా టీ పీసీసీ కసరత్తు చేస్తోంది. హామీలు ఉంటు న్నాయి. అయితే ఈ హామీలు బాగానే ఉన్నప్పటికీ.. ప్రజలకు ఎలా నమ్మకం కలిగించాలనే దానిపైన ప్రతి పక్ష కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలను మెజార్టీ ప్రజలు విశ్వసించడం లేదు. పార్టీకి కీలకమైన మ్యానిఫెస్టో లో పొందుపర్చి.. అధికారంలోకి వచ్చాక అమలు చేస్తా మని చెప్పినా పెద్దగా ఆసక్తి చూపడం లేదనే టాక్‌ వినిపి స్తోంది. గత అనుభవాల దృష్ట్యానే రాజకీయ పార్టీలు చెప్పే అంశాలు, హామీలు, పథకాలపై ప్రజలు నమ్మకం పెట్టు-కోవడం లేదు. ఇటీ-వల జరిగిన వివిధ ప్రైవేట్‌ సం స్థల సర్వేల్లోనూ ఈ విషయాలు తేటతెల్లం అయ్యాయి.

దీంతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికారం లోకి రావా లని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ..తన పథకాలు, హామీ లను జనాలకు ఏ విధంగా వివరిస్తే.. నమ్మే పరిస్థితి ఉంటు -ందనే అంశంపై అంతర్గతంగా మదన పడుతుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ తన రెండు ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అనేక కీలక మైన హామీలను రెండు సార్లు అధి కారం ఉన్నప్పటికీ నెరవేర్చలేదు. దాదాపు 9 ఏళ్ల పాటు- ఎదురుచూసినా..ప్రజలకు నిరాశే మిగిలింది.ఆ హామీ లపై నిత్యం ప్రశ్నిస్తూనే జనాలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్న కొత్త హామీలను జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం, హామీల అమలుపై భరోసా కల్పించడం ఇప్పుడు ఆ పార్టీకి బిగ్‌ టాస్క్‌ గానే మారనున్నదని పొలిటికల్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

కాంగ్రెస్‌ అధికారం లోకి వస్తే చేయదలచిన పథకాలు, కార్యక్రమాలపై డిక్లరేషన్ల పేరిట విడుదల చేస్తున్నది. ఇప్పటికే రైతు, యూత్‌, భూమి డిక్లరేషన్లను విడుదల చేసింది. వీటిలో రూ.2 లక్షల రుణమాఫీ, కౌలు రైతు లకు రూ.15 వేల పెట్టబడి, ఉపాధి హామీ పథకంలో ని రైతు కూలీలకు రూ.12 వేలు ఆర్థిక సాయం, ధరణి పోర్టల్‌ రద్దు, పోడు భూములు క్రయ విక్రయాలు చేసేలా హక్కులు కల్పించడం తో పాటు- అన్ని పంట లకు మద్ధతు ధర, రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టబద్ధమైన రైతు కమిషన్‌ వం టివన్నీ డిక్లరేషన్లలో పొందుపరిచింది. అంతేగాక అమర వీరులకు రూ.25వేల పెన్షన్‌, 2లక్షల ప్రభుత్వ ఉద్యో గాల భర్తీ, నిరుద్యోగ యువకులకు నెలకు రూ.4వేల భృతి ,యూత్‌ కమిషన్‌, రూ.10లక్షలు వడ్డీ లేని రుణా లు వంటివన్నీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో పాటు- మహిళా, మైనార్టీ, బీసీ తో పాటు- మరిన్ని డిక్లరేషన్లను ఆ పార్టీ ఆగస్టు చివరి వరకు విడుదల చేయనున్నది. సెప్టెం బర్‌ 17న కాంగ్రెస్‌ పార్టీ పూర్తి స్థాయి మ్యానిఫెస్టోను రిలీజ్‌ చేయనున్నారు. ఈ అంశాలను జనాల మెదళ్లకు ఎక్కించడం కాంగ్రెస్‌కు సవాల్‌ గా మారనున్నది.

కీల‌క హామీలకు తూట్లు…

బీఆర్‌ఎస్‌ పార్టీ 2014,2018 లో అనేక కీలక హామీలు ఇచ్చింది. రెండు పర్యాయాలు అధికా రంలోకి వచ్చింది. కానీ, ఏకంగా మ్యానిఫెస్టోలో పె ట్టిన అంశాలను కూడా విస్మరించిందనే ఆరోపణలు ఉన్నాయి. కేజీ టూపీజీ ఉచిత విద్య, రైతులకు లక్ష రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీలకు 12 శాతం రిజర్వే షన్‌ , పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌, అమరుల కుటు-ంబాలకు రూ.10 లక్షల సాయం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి, నిరు ద్యోగ భృతి, ఉద్యోగ ఖాళీలు భర్తీ, ఫీజు రీయి ంబర్స్‌ వంటి ఎన్నో అంశాలు ఇలా అమలు కానీ హమీలు ఉన్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోంది. దీంతో ఓట్ల కోసమే అన్ని రాజకీయ పార్టీలు హామీలిస్తున్నాయని. ఓట్లు- రాల్చుకున్న తర్వాత వాటిని విస్మరిస్తున్నారని ప్రజలు బలంగా నమ్ము తున్నారు. అయితే ధనిక రాష్ట్రంగా చెబుకుంటున్న తెలంగాణలో కనీసం రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. దీంతో గ్రామీణ ప్రజలు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి…చేతులు దులుపుకుంటాయనే భావనలోకి వచ్చే శారు.ఇదే క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఏక ంగా రూ. 2 లక్షల రూణమాఫీ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అంతేగాక రూ.4 వేల నిరుద్యోగ భృతి ని కూడా డిక్లరేషన్‌ లో పొందుపరిచింది. రెండు సార్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయలేని ఈ పథకాలను..కొత్తగా కాంగ్రెస్‌ చేస్తుందనే విషయాన్ని జనాలకు నమ్మించేందుకు ఎలా ముందుకు పోవాలి? అనే దానిపై ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాలు అంతర్గతంగా చర్చించుకోవడం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement