Saturday, May 4, 2024

Congress – మల్కాజిగిరి బరిలో జితేందర్ , న‌రేంద్ర చౌద‌రికి ఖ‌మ్మం సీటు?

రేవంత్ రెడ్డి స‌రికొత్త వ్యూహం..
వేగంగా పావులు క‌దుపుతున్న కాంగ్రెస్

న‌రేంద్ర చౌద‌రి ఇంటికి రేవంత్

హైద‌రాబాద్ – లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో అత్య‌ధిక సీట్లు సాధించాల‌నే ల‌క్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అత్యంత వేగంగా పావులు క‌దుపుతున్న‌ది.. దీనిలో భాగంగా బిజెపి చెందిన కీల‌క నేత‌, మాజీ ఎంపి జితేంద‌ర్ రెడ్డి, తెలుగు టివి ఛాన‌ల్ న‌రేంద్ర‌చౌద‌రిను బ‌రిలోకి దింపాల‌ను భావిస్తున్న‌ది.


మ‌హ‌బూబ్ న‌గ‌ర్ సీటు తిర‌స్క‌రించ‌డంతో జితేంద‌ర్ రెడ్డి నేటి ఉద‌యం రేవంత్ రెడ్డితో భేటి అయ్యారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను కాంగ్రెస్ పార్టీలోకి రావాల‌సిందిగా సిఎం ఆహ్వానించారు.. ఇదే స‌మ‌యంలో మ‌ల్కాజీగిరి సీటు ఆయ‌న‌కు ఆఫ‌ర్ చేసిన‌ట్లు వార్త‌లు విన‌వ‌స్తున్నాయి.. ఇక ఖ‌మ్మం నుంచి న‌రేంద్ర చౌద‌రిని దించాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ ఈ మేర‌కు ఆయ‌న‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు.. ఈ మేరకు రేవంత్ స్వయంగా నేడు నరేంద్ర చౌదరి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలసిందిగా ఆహ్వానించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement