Saturday, May 4, 2024

TS: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు బరువు, బాధ్యతల్లేవ్.. హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు బరువు, బాధ్యతల్లేవని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు దగ్గర పడగానే టెంట్లు వేసి స్టంట్ లు చేస్తదన్నారు. టెంట్లతో స్టంట్లు వేయడమే కాంగ్రెస్ పని అన్నారు. ఇవాళ రూ.19 వేల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. ఒకప్పుడు హుస్నాబాద్ లో అన్నీ గుంతల రోడ్లు ఉండేవని, ఇప్పుడు అన్ని సీసీ రోడ్లు అయ్యాయన్నారు. దాదాపుగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రూ.7752 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. 2500 కోట్ల రూపాయలతో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు.

  • రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి రెండు పంటలకు ఢోకా లేదన్నారు. తెలంగాణ కోసం కేంద్రంలో కొట్లాడటం కాంగ్రెస్ కు చేతకాదన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేద్దామని ప్రజలే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారన్నారు.
  • తెలంగాణలో జరిగిన అభివృద్ధి చూసి నేర్చుకుని మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి మంత్రి సూచించారు. అబద్ధాల కాంగ్రెస్ కు అభివృద్ధి సాధించిన బీఆర్ఎస్ పార్టీ విజయాలకు పోటీ అన్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటైనా అమలు చేసిందా..? చర్చకు తాను సిద్ధమని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు మంత్రి హరీశ్ రావు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ మూడోసారి సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ హైట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement