Friday, May 3, 2024

12వ తరగతి వరకు కామన్‌ యూనిఫామ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థులకు కామన్‌ యూనిఫామ్‌ను అమలు చేయనున్నారు. 1 నుంచి 12వ తరగతి వరకు గల బాలబాలికలందరికీ తలా రెండు జతల యూనిఫామ్‌లను ఉచితంగా ఇవ్వనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలలు, కేజీబీవీలు, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, మోడల్‌ స్కూళ్లు, తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ స్కూళ్లు, గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలు, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఒకే కలర్‌తో కూడిన యూనిఫామ్‌లను పంపిణీ చేస్తారు. అయితే ఈ యూనిఫామ్‌లకు కావాల్సిన వస్త్రాన్ని జిల్లాలకు అధికారులు ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు.

జులై 15 కల్లా ఒక జత, ఆగస్టు 15 కల్లా మరో జతకు కావాల్సిన వస్త్రాన్ని జిల్లాలకు చేరవేసే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మొత్తం 26,79,497 మంది విద్యార్థులకు 1,40,21,286 మీటర్ల వస్త్రం పట్టనుంది. మొదటి విడతలో 67,75,522 మీటర్లను, రెండో విడతలో 63,30,858 మీటర్ల వస్త్రాన్ని అందజేస్తారు. ఒక్కో జతకు కుట్టుకూలీగా రూ.50 ఇచ్చి మహిళా సంఘాలతో కుట్టించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement