Saturday, May 18, 2024

కొండా మూవీ రివ్యూ..

రియ‌ల్ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ప‌లు బ‌యోపిక్ ల‌ను ఇప్ప‌టికే తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. అదే త‌ర‌హాలో కొండా ముర‌ళి..కొండా సురేఖ దంప‌తుల జీవిత‌క‌థ‌ని కొండా పేరుతో రూపొందించారు వ‌ర్మ‌. ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

కొండా కథ ఏంటంటే..ఇద్ద‌రు విద్యార్థి నాయ‌కులు.. రాడికల్ నేపధ్యం వైపు ఎలా ఆకర్షితులు అయ్యారు..రాజకీయంగా ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనే పాయింట్ చుట్టూ తిరిగే కథ ఇది. కొండ మురళిగా త్రిగుణ్ ఓ స్ట్రాంగ్ పర్శన్ గా మనకు కనిపిస్తారు. ఆయన ఆవేశపరుడు. ఎవరికి అన్యాయం జరిగినా చూస్తే ఆగలేరు. కాలేజీ రోజుల్లో రాజ్యాంగం చదివి ఉత్తేజితుడు అవుతాడు. మురళి విప్లవాత్మక ఐడియాలజీని చూసిన ఆర్కే (ప్రశాంత్ కార్తి) అతన్ని ఎంకరేజ్ చేసి తమ నక్సల్స్ లో కలుపుకుంటాడు.1990 లో వరంగల్ నేపధ్యంలో జరిగిన క‌థ‌ని చూపించారు…

విశ్లేష‌ణ‌.. బయోపిక్ లో ఎంత వాస్తవం ఉన్నది అనేదాన్ని బట్టే… దాని గౌరవం, ప్రశంసలు దక్కుతాయి. అయితే ఒక్కోసారి డ్రామా ఆ నిజాలని కప్పేస్తుంది. అలాంటి ప్రయత్నమే వర్మ తన సినిమాల్లో చేస్తూంటారు. అందుకే ఇలాంటి బయోపిక్ కథల్లో పెద్దగా విశ్లేషించటానికి ఉండదు. ఎందుకంటే ఓ గొప్ప బయోగ్రఫీకు హిస్టారికల్ ఏక్యురసీ అవసరం. అలాగే unbiased biopic చెప్పగలగాలి. పూర్తి ఆబ్జెక్టివ్ గా విషయాన్ని చెప్పగలగటం అనేది చాలా కష్టమైన పనే. అది వర్మ కు స్పష్టంగా తెలుసు. కాబట్టి అందరికీ తెలుసున్న కొన్ని సంఘటలనే గ్లోరిఫై చేస్తూ సినిమాని రక్తి కట్టించటానికి ఆయన ప్రయత్నం చేసారు. అయితే అవేమీ తెరపై వర్కవుట్ కాలేదు. చాలా సార్లు తేలిపోయాయి. కాకపోతే వర్మ తనదైన లాజిక్ సీన్స్ తో, కన్విక్షన్ తో కొన్ని సార్లు ఒప్పిస్తాడు. పెత్తందార్ల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరుడుతున్న పరిస్దితులను మాత్రం సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు.

- Advertisement -

న‌టీన‌టులు.. నటీనటుల ఫెరఫార్మెన్స్ లు బాగానే ఉన్నాయి..వాస్తవిక పద్దతిలో నడిచే నేరేషన్ బాగుంది.నటీనటుల్లో త్రిగుణ్ ఫెరఫెక్ట్ ఛాయిస్. మానరిజంలు, డైలాగు డెలవరీ సినిమాకు ఓ కొత్త లుక్ తెచ్చిపెట్టాయి. నటనలో ఇంటెన్స్ తీసుకొచ్చారు.అలాగే సెకండాఫ్ లో అతని నటనలో డెప్త్ కనిపిస్తుంది. సురేఖ పాత్రలో నటించిన ఇర్రా మోర్‌ తన నటనతో ఆశ్చర్యపరుస్తుంది. కమిడయన్ పృథ్వీరాజ్‌ నెగిటివ్ రోల్ లో రాణించారు. డీసెంట్ గా చేసుకుంటూ పోయారు. ఎల్బీ శ్రీరామ్, తులసి వంటి సపోర్టింగ్ ఆర్టిస్ట్ లు ఆ పాత్రలకు ఫెరఫెక్ట్ యాప్ట్.

ఎక్కడా కొత్తదనం అనిపించకపోవటం..డాక్యుమెంటిరీలా చాలా సార్లు అనిపించింది.ఇలాంటి బయోపిక్ డ్రామాలు తీయటంలో రామ్ గోపాల్ వర్మ పండిపోయారు. అయితే ఎప్పటిలాగే తన టెంప్లేట్ లోనే ఈ సినిమాని తీసారు. 90లనాటి రియలిస్టిక్ వాతావరణం క్రియేట్ చేసారు. మ్యూజిక్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్..ఆ ప్రొసీడింగ్స్ కు తగ్గట్లుగానే ఉంది. మనీష్ ఠాకూర్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. రన్ టైమ్ ని తగ్గించి మేలు చేసారు. సినిమాటోగ్రఫీ కూడా నేరేషన్ కు తగినట్లు సహజంగా సాగింది. ప్రొడక్షన్ వాల్యూస్ సోసోగా ఉన్నాయి.ఇక ప్రేక్ష‌కులు చూసే తీరు.వారి ఇష్టా ఇష్టాల మేర‌కి వ‌దిలేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement