Tuesday, July 16, 2024

TS : అక్రమ కట్టడాలపై క‌లెక్ట‌ర్ సీరియ‌స్‌… మల్లారెడ్డి అల్లుడి కాలేజీలో కూల్చివేతలు..

అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై క‌లెక్ట‌ర్ సీరియ‌స్ అయ్యారు. గతంలో చిన్నదామర చెరువులో ఎరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలో స్థలాలు ఆక్రమించినట్లుగా ఫిర్యాదులు రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు.క లెక్టర్ గౌతం ఆదేశాలతో తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు మొదలు పెట్టారు మూడు శాఖల అధికారులు.

ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారించిన కలెక్టర్ అధికారులకు కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి అక్రమ నిర్మాణాలు తొలగింపు చేపట్టారు గండిమైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులు. దుండిగల్ పరిధిలో అక్రమ కట్టడాలను మున్సిపల్, ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు శాఖ అధికారులు నేలమట్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement