Tuesday, May 7, 2024

120 రోజులు… 270 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం..

ప్ర‌భ‌న్యూస్ : ఈ ఆర్థిక సంసవత్సర బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించేందుకు సింగరేణి సంస్థ కార్యాచరణ చేపట్టింది. మిగిలిన ఈ నాలుగు నెలల వ్యవధిలో అంటే 120 రోజులలో.. 270 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రవాణా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రోజుకు 14.4 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీ తొలగించేందుకు గాను సింగరేణిలో ప్రతి ఒక్కరు సమిష్టిగా పని చేయాలని సంస్థ డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌, ఎన్‌.బలరామ్‌, డి.సత్యనారాయణలు ఏరియాల జీఎంలకు దిశా నిర్ధేశంచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలలు బొగ్గు ఉత్పత్తికి కీలకమని, డిసెంబర్‌లో రోజుకు 2.15 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని, సరాసరి రజుకు 39 రేకుల ద్వారా బొగ్గు రవాణా జరగాలన్నారు. రోజుకు 2 లక్షల టన్నుల ఓవర్‌ బర్డెన్‌ తీయాలని లక్ష్యంగా నిర్దేశించామవని, ఇప్పటికే అన్ని ఏరియాల్లో ఉపరితల గనులకు అవసరమైన ఓబీ కాంట్రాక్టులు, యంత్రాలు, రావాల్సిన అనుమతులు సమకూర్చినందున నిర్దేశిత లక్ష్యాలకు తగ్గకుడా ఉత్పత్తి సాధించాలన్నారు.

భద్రతా చర్యలను పాటిస్తూ బొగ్గు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బొగ్గు నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈడీ జె.అల్వీన్‌, సూర్యనారాయణ సూచించారు. మొదటి 8 నెలల్లో రవాణా 60 శాతం, ఉత్పత్తిలో 52 శాతం, ఓబీ తొలగింపులో 26 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ మాసం నాటికి 26.935 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40.86 టన్నుల ఉత్పత్తి సాధించడంతో 52 శాతం వృద్ధిని సాధించామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 42.462 టన్నుల బొగ్గు రవాణా సాధించగా.. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన 26.517 మిలియన్‌ టన్నుల మీద 60 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. గతేడాది మొదటి 8 నెలల్లో 187.6 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ తొలగించగా.. ప్రస్తుతం 26 శాతం వృద్ధితో 236.44 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీని తొలగించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సింగరేణి ఉన్నతాధికారులు సురేంద్రపాండే, సూర్యనారాయణ, నాగభూషన్‌రెడ్డి, సత్తయ్య, సురేందర్‌, రమేష్‌రావు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement