Friday, September 13, 2024

ఇవాళ వరంగ‌ల్, ఖ‌మ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ ప్ర‌జాఆశీర్వాద స‌భ

ఎన్నిక‌ల ప్ర‌చారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుంది. వ‌రుస స‌భ‌లు నిర్వ‌హిస్తూ సీఎం కేసీఆర్ గెలుపే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ‌(శుక్ర‌వారం) వరంగ‌ల్, ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ ప్ర‌జాఆశీర్వాద స‌భ‌ల‌లో పాల్గొనున్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని మహబూబాబాద్‌, వర్దన్నపేట, పాలేరులో ప్రచార సభల్లో పాల్గొంటారు.

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిత్వం పొంగులేటికి ఖరారయ్యే అవకాశం ఉండటంతో నియోజకవర్గంపై మరింత ఫోకస్ పెంచారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ చేపట్టబోయే తొలి బహిరంగ సభ కావడంతో అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స‌భ‌ల‌లో అభివృద్ధి, సంక్షేమం, మేనిఫెస్టోను ప్రజలకు కేసీఆర్ వివరించనున్నారు. ఈ సభల‌కు సీఎం కేసీఆర్ హాజరుకానుండటంతో విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement