Saturday, May 18, 2024

BRS Party : 51మంది అభ్యర్థులకు బీ-ఫామ్ లు అందజేసిన కేసీఆర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీ-ఫామ్ లు అందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో 51మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు అంద‌జేశారు. ఒక్కో అభ్య‌ర్థికి రెండు బీ-ఫామ్ లు అందిస్తున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. మిత‌గా వారికి రేపు బీ-ఫామ్స్ అందిస్తామ‌న్నారు. కేసీఆర్ త‌ర‌పున గంప గోవ‌ర్ధ‌న్, మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి త‌ర‌పున ఎమ్మెల్సీ క‌విత బీ-ఫామ్స్ అందుకున్నారు. ఉమ్మ‌డి మెద‌క్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, ఖ‌మ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల‌కు చెందిన బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు అంద‌జేశారు.

బీ-ఫామ్స్ అందుకున్న అభ్యర్థులు…
బీ-ఫామ్స్ అందుకున్న వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ష‌కీల్, జాజాల సురేంద‌ర్, గ‌ణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, గంప గోవ‌ర్ధ‌న్, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, రాజేంద‌ర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ల‌క్ష్మా రెడ్డి, ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి, మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, గువ్వ‌ల బాల‌రాజు, జైపాల్ యాద‌వ్, అంజ‌య్య యాద‌వ్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి, ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి, చంటి క్రాంతి కిర‌ణ్, మ‌హిపాల్ రెడ్డి, కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, రేగా కాంతారావు, హ‌రిప్రియ నాయ‌క్, పువ్వాడ అజ‌య్, లింగాల క‌మ‌ల్ రాజ్, సండ్ర వెంక‌ట వీర‌య్య‌, వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్ రావు, మెచ్చా నాగేశ్వ‌ర్ రావుతో పాటు ప‌లువురు అందుకున్నారు. మిగతా అభ్యర్థులకు రేపు బీ ఫామ్ లు అందజేస్తామని తెలిపారు. టికెట్ రాని వారు తొందప పడొద్దని కేసీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement