Wednesday, May 15, 2024

ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి. జిల్లా గ్రంథాలయ ఆవరణలో మొక్కలు నాటి వేడుకలను ప్రారంభించారు నగర మేయర్ సునీల్ రావు. ఉదయం అన్ని డివిజన్లలో టిఆర్ఎస్ కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు దేవాలయాల్లో పూజలు మరియు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 25వ డివిజన్ లో టిఆర్ఎస్ నాయకులు ఎడ్ల అశోక్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమములో భాగంగా కోడి పుంజులను దానం చేశారు. భగత్ నగర్ లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో బర్త్ డే కేక్ కటింగ్ జరిగింది. నగర టిఆర్ఎస్ పార్టీ నాయకుడు చల్ల హరిశంకర్  ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో భారీ కేక్ కటింగ్, మిఠాయిల పంపిణీ, పండ్ల పూల మొక్కల పంపిణీ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement