Saturday, May 4, 2024

మల్టిపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ రిక్రూట్‌మెంట్‌లో మార్పులు.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థలు, ఆరోగ్య కార్యక్రమాల్లో పనులు చేసే కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మరింత అవకాశాలు పెంచేలా ఎంపిక ప్రక్రియలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి ద్వారా కొనసాగుతున్న మల్టిపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫీమేల్‌) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి మార్పులు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న గరిష్ట వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 49 ఏళ్లకు పెంచింది. ఇప్పటికే నోటిఫై చేయబడిన 1666 పోస్టులకు అదనంగా ఇప్పటికే టీవీవీపీలో ప్రకటించిన 265 పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్‌లో కలుపుతున్నారు. దీంతో మొత్తం భర్తీ చేసే ఎంపిహెచ్‌ పోస్టుల సంఖ్య 1931 కానుంది. ఖాళీలతో పాటు మరో 146 ఖాళీలు గుర్తించింది.

- Advertisement -

ఇంతకుముందు రాత పరీక్షకు 80 పాయింట్లు, సర్వీసుకు 20 పాయింట్లు వెయిటేజీ ఉండగా, ఇప్పుడు రాత పరీక్షకు 70 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు గాను గరిష్టంగా 30 పాయింట్లు నిర్దేశించింది. గిరిజన ప్రాంతాలలో సేవలు అందించే వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, గిరిజన ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో సేవలు అందించే వారికి 6 నెలలకు 2 పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ మేరకు హెల్త్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌, ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా, ఈ విషయాన్ని ట్వీట్‌ చేసిన వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement