Thursday, May 2, 2024

Bomb Call – తిరుమల కి బాంబు బెదిరింపు… వీడియోతో

తిరుమల (ప్రభన్యూస్ ప్రతినిధి ) : రెండురోజులక్రితం అలిపిరి తనిఖీ కేంద్ర‌ంలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందని టీ టీ డి కి బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసారు. తిరుమల డిఎస్పీ భాస్కర్ రెడ్డి కథనం మేరకు ఈ నెల 15వ తేదీన ఉదయం 11.25 గంటలకు టీటీడీ కంట్రోల్ రూంకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద పెద్ద పేలుడు జరుగుతుందని, ఆ ప్రమాదంలో 100 మంది భక్తులకు చనిపోతారన్నదే ఆ అపరిచితుడు నుండి వచ్చిన ఫోన్ కాల్ సారాంశం.

ఫోన్ కాల్ తో అప్రమత్తం అయినా సిబ్బంది అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద పూర్తిస్థాయిలో తనిఖీలునిర్వహించగా ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించలేదు. ఆపై టీ టీ డి విజిలెన్స్ అధికారులు ఫోన్ కాల్ పై పోలీసులు ఫిర్యాదు చేశారు.విచారణ చేపట్టిన పోలీసులు ఆ నకిలీ ఫోన్ కాల్ చేసి అలజడి సృష్టించిన వ్యక్తి, సేలంకు చెందిన బాలాజీ అని గుర్తించారు. అతడిని ఈ రోజు ఆరెస్ట్ చేసినట్టు డి ఎస్ పి భాస్కర్ రెడ్డి తెలిపారు.టీటీడీకి తప్పుడు కాల్స్ఇ చేసి బ్బంది కలిగించే ,ఆకతాయి చేష్టలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement