Friday, April 26, 2024

వర్షాలతో పిడుగులు పడే చాన్స్‌.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎండాకాలంలో కురుస్తున్న వర్షాల వల్ల పిడుగులు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయని రాగల రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరత్నం తెలిపారు.

రాష్ట్రంలో 44 డిగ్రీల మేర నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వర్షాల కారణంగా కాస్త తగ్గుముఖం పట్టాయని ఆమె చెప్పారు. వర్షాలకు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement