Thursday, May 2, 2024

ఎమ్మెల్యేల ఎర కేసు – 17 త‌ర్వాత అరెస్ట్ ల ప‌ర్వం?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మధ్య యుద్ధ వాతావ రణం కొనసాగుతోంది. కొన్ని విషయాలు బహిర్గతం కాకపోయినా అంతర్గతంగా కాస్త గట్టిగానే ఫైట్‌ నడుస్తోంది. మొయినాబాద్‌ ఫాంహౌస్‌ కేసుకు సంబంధించి గత వారం, పది రోజులుగా సీబీఐ తన విచారణలో దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశోధిస్తూ అధికారులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సిట్‌ విచారణను హైకోర్టు తోసిపుచ్చిన అనం తరం వార్‌ వన్‌సైడే.. అన్నట్లుగా విచారణ కొనసాగుతోంది. ఈ విషయంపై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీంతో సుప్రీం కోర్టులో కేసు ఈ నెల 17న విచార ణకు రానుంది. అయితే అప్పటి వరకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సీబీఐ తన విచారణ కొనసాగించవచ్చు. దీనిపై సీబీఐ, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి (చీఫ్‌ సెక్రెటరీకి) 5సార్లు నోటీసులు ఇవ్వడంతో పాటు కీలక సమాచా ర పత్రాల కోసం పలుసార్లు లేఖలు కూడా రాసింది. మీ వద్ద ఉన్నా ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు సమర్పించాలని కోరింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది.


అయితే, ఈనెల 17న సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యం లోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అటు సీబీఐ బృందాలు మౌనం పాటిస్తున్నట్లు తాజా పరిస్థితులను బట్టి స్పష్టమవుతోంది. అప్పటి వరకు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు- సమర్పించేం దుకు తెలంగాణ సర్కారు సందిగ్ధాన్ని ప్రదర్శిస్తోంది. న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు, ఏవైనా ప్రత్యేక పరిస్థితులుంటే తప్ప సుప్రీంకోర్టు కూడా కిందికోర్టు తీర్పునే సమర్ధిస్తుంది. అదే జరిగితే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో త్వరలోనే అరెస్టుల పర్వం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో అడిగిన సమాచారం ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోర్టు ధిక్కరణ కింద కేసుల్లో ఇరికించే దిశగా కూడా చర్యలు కొనసాగు తున్నాయి. ఈ క్రమంలో ఉన్నతాధికార యంత్రాంగాన్నీ బోనులో నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసు ఫైల్స్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుండడంతో చివరి అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు చేసేందుకు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసుకుంటు-న్నది. ఐదు లెటర్స్‌ రాసినప్పటికీ చీఫ్‌ సెక్రటరీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కేస్‌ ఫైల్స్‌ కోసం సీబీఐ అధికారులు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయని సీఎస్‌పై కోర్టు ధిక్కరణ ఆంశం కూడా తెరపైకి రానుంది. కేస్‌ ఫైల్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయకపోవడంతో డైరెక్ట్‌గా ఎఫ్‌ఐఆర్‌ రిజిష్టర్‌ చేసేందుకు సీబీఐ అధికారులు ఏర్పాట్లు- చేస్తున్నట్లు- సమాచారం.

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి..
మొత్తం మీద ఎమ్మెల్యేల కొనుగోలు రాష్ట్రం పరిధి దాటి సుప్రీం కోర్టు, సీబీఐ వరకు వెళ్లింది. తెలంగాణ సర్కారు, బీజేపీల మధ్య ఈ విషయమై పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. రాష్ట్రంలో ఓ పక్క ఢిల్లీ లిక్కర్‌ స్కాం, మరో పక్క ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సై అంటే సై అంటూ దూకుడుగా ముందుకెళ్తున్నాయి. మరి ఈ స్కాంల గొడవ ఎంత దూరం వెళుతుందో ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందో ఏ పార్టీకి ఓట్లను తెచ్చిపెట్టి అధికారంలోకి తీసుకొచ్చే వరంలా తయారవుతుందో వచ్చే ఎన్నికల నాటికి తేలనుంది.

వ్యాపారులు మొదలుకుని రాజకీయ నేతల దాకా..
ఢిల్లిd లిక్కర్‌ స్కాంలో విచారణలో కూడా సీబీఐ జోరు పెంచింది. దీంతో నిందితులుగా ఉన్న వారిలో -టె-న్షన్‌ మొదలైంది. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్‌లపై దృష్టి పెట్టారు. సీబీఐ ఇప్పటి వరకూ ఇద్దరిని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశాయి. ఈ స్కామ్‌లో భారీగా ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీబీఐ, ఈడీలు ఇప్పటికే పలువురిని విచారించాయి. పలుచోట్ల తనిఖీలు నిర్వహించాయి. ఇప్పటి వరకూ వ్యాపారవేత్త లకే పరిమితమైన అరెస్ట్‌లు రాజకీయ నేతల వరకూ వచ్చాయి. తాజాగా వైసీపీ పార్లమెంటు- సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి
కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అరెస్ట్‌ చేసింది. దీంతో ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటు-న్న వారి విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయా? అన్న దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement