Friday, December 6, 2024

కారులో మంటలు.. తప్పిన ముప్పు

నడుస్తోన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది గమనించి కారులో ఉన్నవారంతా ముందు జాగ్రత్తగా బయటికి దిగారు. ఆ తర్వాత మంటలు కారంతా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే, మంటలు చెలరేగడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని స్కోడా నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎంజీఐటీ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement