Saturday, May 4, 2024

TS : నేను గొర్రెను కానూ, కాలేను…ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…

ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీని వీడనని ఆర్ఎస్పీ స్పష్టం చేశారు. కే కేశవరావు, కడియం శ్రీహరి.. అకస్మాత్తుగా బీఆర్ఎస్‌ పార్టీని వీడటంతో తనకు కొంత మంది ఫోన్ చేసి వారి బాటలోనే నడిచి మంచి దారి వెతుక్కోమంటున్నారని.. మరి కొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీని వీడొద్దని, ఈ పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడాలని కోరుతున్నట్టు ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆర్ఎస్పీ సుదీర్ఘ ట్వీట్ చేశారు ఆర్ఎస్పీ.

గెలుపుతో వచ్చే అధికార ఫలాలను అనుభవించినప్పుడు, ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగిన వాడే నిజమైన నాయకుడని ప్రవీణ్ అన్నారు. ప్రతి దానికి భయపడే పిరికిపందలకు బీఆర్ఎస్ వంటి ఉద్యమ పార్టీల్లో స్థానం ఉండకూడదని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు పోలీసు కేసులు పెడుతున్నారని, కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీటిని మనం ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన శీర్షికలతో రాజకీయ ప్రత్యర్థులపై జరుగుతున్న కుట్రపూరిత దాడులను అందరం తిప్పికొట్టాలని అన్నారు.

- Advertisement -

వెన్నుపోట్లు, కుట్రలు, ద్రోహాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదని… ప్రజల గుండెల్లో మనకు స్థానం పదిలంగా ఉన్నంత కాలం ఏ శక్తీ మన ప్రస్థానాన్ని ఆపలేదని ప్రవీణ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ద్రోహుల చెంప చెళ్లుమనేలా విజయభేరి మోగిద్దామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement