Thursday, May 2, 2024

Candidates Assets – Debts: అమీర్​గా గ‌డ్డం…గరీబ్​గా బండి…

ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ఆధారంగా పోటీ చేస్తున్న అభ్యర్దుల్లో సంపన్నుడు గడ్డం వివేక్ కాగా..నిరుపేద బీజేపీ నేత బండి సంజయ్ గా నిలిచారు. టాప్ -20 లో పది మంది కాంగ్రెస్ నేతలే ఉన్నారు. తెలంగాణలో ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థులు తమ ఆస్తులు – అప్పుల వివరాలు ప్రకటించారు.

వారిలో చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న గడ్డం వివేక్‌ రూ.606 కోట్లతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. పేద అభ్యర్థిగా బీజేపీ కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ ఉన్నారు. చెన్నూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వివేక్‌ ఆస్తులు రూ.606.67 కోట్లుగా పేర్కొన్నారు. చరాస్తులు రూ.380.76 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.225.91 కోట్లు అని ఆయన తెలిపారు. తనకు, తన భార్యకు రూ.45.44 కోట్ల ఆప్పులు ఉన్నట్లు వివరించారు.
సీఎం కేసీఆర్‌కు కారే లే
కారు గుర్తు గల బీఆర్‌ఎస్‌ అధిపతి, సీఎం కేసీఆర్‌కు కారే లేదు. ఆయన కుటుంబానికి రూ.58.93 కోట్ల మేర ఆస్తులున్నాయి. వీటిలో స్థిరాస్తులు రూ.23.50 కోట్లు, చరాస్తులు రూ.35.43 కోట్లు. మాజీ ఎంపీ జి.వివేక్‌ నుంచి రూ.1.06 కోట్లు అప్పు తీసుకున్నట్లు కేసీఆర్‌ పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్‌…53.31కోట్లు
మంత్రి కేటీఆర్‌.. తన కుటుంబానికి మొత్తం రూ.53.31 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించారు. ఇందులో చరాస్తులు రూ.35.01 కోట్లు, స్థిరాస్తులు రూ.18.30 కోట్లు కాగా, రూ.11.99 కోట్ల మేర రుణాలున్నాయని వెల్లడించారు. 4.8 కిలోల బంగారం, 38.17 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు.
ఈట‌ల రాజేంద‌ర్..50.93కోట్లు
గజ్వేల్‌, హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు రూ.50.93 కోట్ల మేర ఆస్తులున్నాయి. ఇందులో చరాస్తులు రూ.23.65 కోట్లు, స్థిరాస్తులు రూ.27.28 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకు కారు లేదని.. 13.25 ఎకరాల భూమి ఉన్నట్లు చెప్పారు
హ‌రీష్‌రావు…24.29కోట్లు
సిద్దిపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి హరీశ్‌రావు కుటుంబ ఆస్తి రూ.24.29 కోట్లు. కుటుంబానికి మొత్తం రూ.11.50 కోట్ల అప్పులుఉన్నాయి. మధిర కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కకు నయాపైసా అప్పు లేదు. కుటుంబ సభ్యులందరికీ కలిపి రూ.8.13 కోట్ల మేర ఆస్తులున్నాయి. హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి రూ.5.82 కోట్ల మేర ఆస్తులున్నాయి.
పేద నేతగా బండి…
తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ ప్రకటించారు. తనకు ఒకటి, భార్య పేరిట మరో కారు ఉన్నాయని తెలిపారు. చేతిలో రూ.లక్షన్నర, సతీమణి దగ్గర రూ.లక్ష నగదు ఉన్నాయని తెలిపారు. చరాస్తుల విలువ రూ.79.51 లక్షలని, కుటుంబానికి ఎలాంటి స్థిరాస్తులు లేవని ప్రకటించారు. రూ.17.84 లక్షల మేర అప్పులున్నట్లు పేర్కొన్నారు
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ ఆస్తులు రూ.461.05 కోట్లు. ఆయన వార్షికాదాయం రూ.32.07 లక్షలు కాగా.. పొంగులేటి సతీమణి మాధురి ఆదాయం రూ.3.04 కోట్లు. అవిభాజ్య కుటుంబ ఆదాయం రూ.6.50 లక్షలే

Advertisement

తాజా వార్తలు

Advertisement