Saturday, April 27, 2024

ప‌బ్ లో క్యాబ‌రే డ్యాన్స్ – 18మంది అరెస్ట్

సికింద్రాబాద్ ప‌రిధిలోని రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న ట‌కీలా ప‌బ్ లో క్యాబ‌రే డ్యాన్స్ లు మ‌ళ్ళీ ప్రారంభ‌మ‌య్యాయి. ప‌బ్‌లో క్యాబ‌రే డ్యాన్స్ ఏర్పాటు చేసిన వైనాన్ని గుర్తించిన పోలీసులు మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. మ‌ద్యం మ‌త్తులో తూగుతున్న మందుబాబులను మ‌రింత‌గా హుషారెత్తించేందుకు ప‌బ్ యాజ‌మాన్యం యువ‌తుల‌తో నృత్యాల‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా అర్ధ రాత్రి దాటినా కూడా ప‌బ్‌ను కొన‌సాగిస్తూ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించింది..ఈ ప‌బ్ వ్య‌వ‌హారంపై స‌మాచారం అందుకున్న హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ట‌కీలా ప‌బ్‌పై శ‌నివారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత దాడులు చేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప‌బ్‌ను నిర్వ‌హిస్తున్నార‌ని తేల్చిన పోలీసులు ప‌బ్‌ను సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement