Thursday, December 7, 2023

MBNR: బైపాస్ రోడ్డు పనులను నాణ్యతగా నిర్మించాలి… మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 23 (ప్రభ న్యూస్): మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని చిన్నదర్పల్లి నుంచి పాలకొండ బైపాస్ వరకు నిర్మిస్తున్న నూతన బైపాస్ రోడ్డు పనులను నాణ్యతగా, వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్- కోస్గి- చించోలి హైవే నిర్మాణ పనుల్లో భాగంగా చిన్న దర్పల్లి వద్ద జరుగుతున్న పనులను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

- Advertisement -
   

మూడు రోజుల శ్రీలంక పర్యటనను ముగించుకుని విమానాశ్రయం నుంచి నేరుగా మంత్రి మహబూబ్ నగర్ చేరుకున్నారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణంతో భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా నేరుగా రాయచూరు, కోస్గి, హైదరాబాద్, కొత్తకోట వైపునకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. పట్టణంలో శివారు కాలనీలు, అభివృద్ధిలో వెనకబడిన ప్రాంతాలు సైతం ఈ బైపాస్ వల్ల అభివృద్ధి చెందుతాయన్నారు. హన్వాడ ఫుడ్ పార్క్ నుంచి దివిటిపల్లి ఐటీ కారిడార్ చేరుకునేందుకు ఈ బైపాస్ ఎంతో అనువుగా ఉంటుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement