Sunday, April 28, 2024

Breaking News – దిశను మార్చుకున్న మీచాంగ్ తుఫాన్ – నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం

అమరావతిమీచాంగ్ తుఫాన్ తన దిశను మార్చుకున్నది. ప్రస్తుతం సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృత మైంది .రాత్రి పది నుండి పన్నెండు గంటల లోపు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది

దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మందపల్లి గ్రామంలో విపరీతమైన ఈదురు గాలులు భారీ వర్షం కురుస్తున్నాయి... నెల్లూరు-బాపట్ల జిల్లాల మధ్య తుఫాన్ తీరం దాటుతుండటంతో జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు నెల్లూరు జిల్లాలోని పోదలకూరు, రాపూరు, చేజర్ల, కలువాయి మండలాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. రెవెన్యూ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని చెట్లను తొలగిస్తున్నారు

మిచాంగ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత భూమి మీద నిదానంగా ప్రయాణిస్తూ ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా పయనించనుందన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

తొలుత అందరూ మచిలీపట్నం వద్ద తీరం దాటింది అనుకున్నారు కానీ ఇది ఆకస్మాత్తుగా తన దిశ మార్చుకొని నెల్లూరు.. కావలి మధ్యలో తీరం దాటే పరిస్థితి. ఏర్పడింది తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వియనున్నాయి .

Advertisement

తాజా వార్తలు

Advertisement