Thursday, May 2, 2024

Boath – రెవెన్యూ డివిజన్ కోసం.. అంతర్ రాష్ట్ర రహదారి దిగ్బంధం

బోథ్ సెప్టెంబర్ 24 ప్రభ న్యూస్ – ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గత 70 రోజులుగా పలు రకాలుగా పోరాటం కొనసాగిస్తున్న రెవిన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు ఆదివారం అంతరాష్ట్ర రహదారిని దిగ్బంధించారు. నిర్మల్ కిన్వాట్ అంతర్ రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఈ రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని పాలకవర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 70 రోజులుగా నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే జిల్లాలోని పలు మండలాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తున్నప్పటికీ అన్ని అర్హతలు ఉన్నా బోథ్ పట్టణాన్ని ఎందుకు రెవిన్యూ విజన్ గా ప్రకటించడం లేదని ప్రశ్నించారు.

ఇక్కడి పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ తమ ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ధర్మ పోరాటమని దీనిని విస్మరిస్తే పుట్టగతులు లేకుండా పోతారని శాపనార్ధాలు పెట్టారు. భరాస నాయకులు గొప్పలు చెప్పుకోవడం కాదని రెవెన్యూ డివిజన్ సాధించి పెట్టాలని హితవు పలికారు. ఇది ఆరంభం మాత్రమేనని ఇంకా ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. కొన్ని గంటలపాటు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్థానిక పోలీసు అధికారులు వచ్చి వారిని సముదాయించారు. వినకపోవడంతో బలవంతంగా స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బోత్ పట్టణ ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement