Wednesday, May 1, 2024

HYD: రాష్ట్రంలో బీజేపీదే అధికారం.. కేంద్ర మంత్రి శ్రీపత్ నాయక్

కర్మన్ ఘాట్, నవంబర్ 8 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపత్ నాయక్ అన్నారు. యాకత్పురా బీజేపీ అభ్యర్థి వీరేంద్రబాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వీరేంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి శ్రీపత్ నాయక్ ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలో ర్యాలీ నిర్వహించి సైదాబాద్ త‌హ‌సీల్దార్ కార్యాలయంలో వీరేంద్రబాబు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని వీరేంద్రబాబుకు మద్దతు తెలిపారు. కేంద్ర మంత్రి శ్రీపత్ నాయక్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెట్టి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల‌ను ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు అభివృద్ధి చేశారని తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం తెల్ల రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి వీరేందర్ బాబు పార్టీ అభివృద్ధితో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తారని తెలిపారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి వీరేందర్ బాబును గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వీరేందర్ బాబు మాట్లాడుతూ… యాకత్పురా నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయనున్నట్లు తెలిపారు. తనను గెలిపిస్తే శాసనసభలో సమస్యలపై ప్రశ్నించి నిధులు మంజూరు చేయించడంతోపాటు అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ బీజేపీ ఉపాధ్యక్షులు జంగం మధుకర్ రెడ్డి, కన్వీనర్ ధీరజ్ లాల్, ప్రధాన కార్యదర్శి సహదేవ్ యాదవ్, మన్నే శ్రీనివాస్ డివిజన్ నాయకులు, నియోజకవర్గ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement