Sunday, April 28, 2024

BJP -Sangareddy – ప్రచారంలో జోరు పెంచిన పులిమామిడి.. ఆరూర్ లో ఇంటింటి ప్రచారానికి అనూహ్యస్పందన

సంగారెడ్డి, నవంబర్ 14 (ప్రభ న్యూస్): సంగారెడ్డి బిజెపి అభ్యర్థి పులిమామిడి రాజు ప్రచారంలో తన ధోరణి పెంచారు ప్రతిరోజు గ్రామాలు మండలాలు వార్డుల వారిగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజా మద్దతును కూడగట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో ప్రచారాన్ని ప్రారంభించారు.

ముందుగా ఆరూరు గ్రామంలోని బసవేశ్వర విగ్రహానికి పూలమాలవేసి కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని షురూ చేశారు.

ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున బిజెపి శ్రేణులు, బీజేవైఎం నాయకులు పాల్గొని ఇంటింటికి బిజెపి మేనిఫెస్టో వివరిస్తూ గ్రామమంతా ప్రచారాన్ని చేపట్టారు

. ఈ ప్రచార కార్యక్రమంలో పులిమామిడి రాజు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి కార్యక్రమాలు, రైతులు, మహిళలకు సబ్బండ వర్గాలకు అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించి దేశాన్ని అభివృద్ధి పతంలో నడిపిస్తున్న తీరును ప్రజలందరికీ వివరిస్తూ ప్రచారాన్ని సాగించారు.

- Advertisement -

కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement