Monday, May 6, 2024

Rishi Sunak :బ్రిటన్ ప్రధాని పై అవిశ్వాస లేఖ‌

హోం సెక్రెటరీ సుయెల్లా బ్రెవర్మన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించినందుకు తీవ్ర విమర్శల పాలవుతున్న రిషి సునాక్‌‌పై సొంత పార్టీ ఎంపీ ఆండ్రియా జెంకిన్స్ అవిశ్వాస తీర్మానం లేఖ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం తాలూకు ఫొటోను నెట్టింట పంచుకున్నారు. ఇలా చాలు. రిషి సునాక పక్కకు తప్పుకోవాల్సిందే’’ అని జెంకిన్స్ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తన అవిశ్వాస తీర్మానం తాలూకు లేఖను పార్టీలోని 1922 కమిటీకి పంపినట్టు చెప్పారు. ‘‘నిజం మాట్లాడినందుకు ఆమెను తప్పించారు. పార్టీలోని లెఫ్ట్ నేతల ఒత్తిడికి లోనై రిషి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు’’ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. కాగా, రిషి సునాక్‌పై జెంకిన్స్ విరుచుకుపడ్డారు. ప్రజాస్వాయుతంగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ పక్కకు తప్పుకోవడానికి కూడా రిషి సునాక్ కారణమని ఆరోపించారు. బ్రెక్జిట్ కోసం బోరిస్ పార్లమెంటులో ధైర్యంగా పోరాడారని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement