Sunday, February 25, 2024

UP : ట్రక్కును ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి

ట్రక్కును కారు బలంగా ఢీకొట్టడంతో స్పాట్ లోనే ఆరుగురు మృతిచెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌ జాతీయ రహదారి-58 పై ముందు వెళ్తున్న ట్రక్కును కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి హరిద్వార్‌ వెళ్తున్న కారు జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని వెల్లడించారు. బాధితులంతా ఢిల్లీలోని షహదారా వాసులుగా గుర్తించినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement