Thursday, May 2, 2024

BJP – విజ‌య‌శాంతికి బిజెపి మొండి చేయి … 40 మంది స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో పేరు గ‌ల్లంతు

హైద‌రాబాద్ – ఫైర్ బ్రాండ్ విజ‌య‌శాంతికి బిజెపి షాక్ ఇచ్చింది.. ఇంత‌కాలం స్టార్ క్యాంపెయిన‌ర్ గా గౌర‌వించిన ఆ పార్టీ తాజా ఎన్నిక‌ల‌లో ఆమెను దూరంగా పెట్టింది.. ఇటీవ‌ల కాలంలో ఆమె పార్టీ కార్య‌క‌ల‌పాల‌కు దూరంగా పెట్ట‌డ‌మే కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు.ఇక 40 మందితో స్టార్ కాంపెయిన‌ర్ల జాబితాను నేడు బిజెపి విడుదల చేసింది. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీకి స్థానం కల్పించింది.

అలాగే యడ్యూరప్ప, లక్ష్మణ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాల, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, మురుగన్, ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్, రవికిషన్, ఏపీకి చెందిన నేత పురంధేరశ్వరిని నియమించింది. అలాగే తెలంగాణకు చెందిన 19 మంది నేతలకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ చోటు కల్పించింది. అందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, రాజాసింగ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, కృష్ణ ప్రసాద్ లు ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement