Monday, April 29, 2024

SL vs Ban : క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా విచిత్రంగా ఔటైన లంక ప్లేయర్.. ఏంజెలో మాథ్యూస్

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా లంక ప్లేయర్ విచిత్రంగా ఔటయ్యాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య 38వ మ్యాచ్ జరుగుతోంది.బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేస్తోన్న శ్రీలంక 27 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసింది. కాగా, ఈ సమయంలో మ్యాచ్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

ఏంజెలో మాథ్యూస్ ఒక్క బంతి ఆడకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. అది కూడా షాకింగ్ రీజన్‌తో ఔట్ అయ్యాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇలా అవుట్ అయిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 41 పరుగుల వద్ద సదీర సమరవిక్రమ ఔటయ్యాడు. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో మహ్మదుల్లా రియాద్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.

అయితే, ఈ సమయంలో శ్రీలంక సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి రావాల్సి ఉంది. కానీ, ఆయన సమయానికి క్రీజులోకి రాలేదు. దీంతో బంగ్లాదేశ్ టీం అంపైర్‌కు అప్పీల్ చేసింది. అంపైర్ కూడా బంగ్లా అప్పీల్‌ను సమ్మతించి, ఏంజెలో మాథ్యూస్‌ను టైం ఔట్‌గా ప్రకటించారు. దీంతో ఏంజెలో మాథ్యూస్ చేసేదేమీ లేక పెవిలియన్ కు చేరుకున్నాడు.

- Advertisement -
https://twitter.com/shawstopper_100/status/1721481627463790653

Advertisement

తాజా వార్తలు

Advertisement