Thursday, May 2, 2024

BJP – తెలంగాణ‌లో ఒంట‌రిగానే పోటీ చేస్తాం …. కెసిఆర్ ని గ‌ద్దెదించుతాం – సునీల్ థియోధర్

హైదరాబాద్: తెలంగాణలో ఒంటరిగానే పోటీచేస్తామని బీజేపీ నేత సునీల్ థియోధర్ తేల్చి చెప్పారు.గురువారంనాడు బీజేపీ నేత సునీల్ ధియోధర్ ఖమ్మంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు.ఈ సందర్భంగా ఆయన హైద‌రాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ఎవరితో తాము పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. తాము తెలంగాణ ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. . కేంద్ర పథకాలను తమ పథకాలుగా కేసీఆర్ చెప్పుకుంటు ఒక స్టిక్కర్ బాబులా మారారంటూ విమ‌ర్శించారు.. తెలంగాణ నుండి కేసీఆర్ ను బయటకు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఆశీర్వాదం ఇస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement