Tuesday, October 15, 2024

NLG : పెన్ ప‌హాడ్‌లో బీజేపీ నాయ‌కురాలు సంకినేని అనూష ఎన్నిక‌ల ప్ర‌చారం

పెన్ పహాడ్, నవంబర్ 21(ప్ర‌భ‌న్యూస్‌) బిజెపి మేనిఫెస్టోను గడపగడపకు చేరవేయాలని జిల్లా నాయకురాలు సంకినేని అనూష అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గడపగడపకు బిజెపి మేనిఫెస్టో పై ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం బిజెపి తోనే అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారానే గ్రామాల అభివృద్ధి చెందాయన్నారు.

రాబోయే ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలన్నారు. కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆరే ప్రభాకర్, బిజెపి నాయకులు తూముల సాయి, గూడపూరి శ్రీనివాస్, రాపర్తి వెంకన్న, రంగినేని విజయ్ కుమార్, చామకూరి వెంకటేష్, పిడమర్తి నాగయ్య, వగ్గు రాములు చినపంగి నాగరాజు, ఒగ్గు వినోద్, మచ్చ శీను, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement