Wednesday, November 29, 2023

AP: కనకదుర్గమ్మ సేవలో ఇంగ్లండ్ యువ క్రికెటర్లు..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : భారత్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ అండర్-19 యువ క్రికెటర్లు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయానికి ఇవాళ ఉదయం ఇంగ్లాండ్ యువ క్రికెటర్లు రాగా వీరికి ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, బుద్ధా రాంబాబు, నాగమణి ఆలయ ఏఈఓ చంద్రశేఖర్ ఘన స్వాగతం పలికారు.

- Advertisement -
   

ఆలయ పండితులు యువ క్రికెటర్లకు అమ్మవారి బొట్టును నుదుటిపై పెట్టి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని యువ క్రికెటర్లు ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ చంద్రశేఖర్, వైదిక కమిటీ సభ్యుడు శంకర సాండిల్య, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement