Friday, April 26, 2024

అదిలాబాద్‌ ఫారెస్ట్ నుంచే బర్డ్ ఫెస్టివల్ షురూ.. 21 ప్రాంతాల్లో పక్షి ప్రేమికుల పర్యటన..

సిర్పూర్‌(టి), ప్రభన్యూస్‌ : రేపటి నుంచి ప్రారంభ మయ్యే పక్షుల పండుగ కార్యక్రమం కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ డివిజన్‌, సిర్పూర్‌(టి) రేంజ్‌ నుండే ప్రారంభం కానుంది. 2019లో పక్షుల పండుగ జరుపుకోగా 350 రకాల పక్షులను గుర్తించారు. పక్షి ప్రేమికులకు మంచి అవకాశం. పక్షులను బంధించేందుకు శాస్త్రవేత్తలు, పక్షి ప్రేమికులు దాదాపు 60మంది వరకు రానున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌లో దట్టమైన అడవులు ఉన్నాయి. వీటిలో వివిధ రకాల జంతువులతో పాటు రకరకాల పక్షులు ఉన్నాయి. ముఖ్యంగా కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని సిర్పూర్‌(టి) రేంజ్‌లో పులుల సంచారం ఎక్కువగా ఉంటుంది. మహారాష్ట్ర లోని తాడోబా నుండి ఇటికల్‌పాడ్‌, మాలిని, తదితర ప్రాంతాల నుండి సిర్పూర్‌(టి) రేంజ్‌లోని అడవుల్లోకి పులులు చేరుతాయి. అనంతరం భూపాలపట్నం, కడంబా గుండా, పెంచికల్‌పేట్‌, బెజ్జూర్‌లోకి పులులు రాకపోకలు చేస్తుంటాయి.



పక్షి ప్రేమికులకు పులులు కూడా కన్పించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌పరిధి లో 21 ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 8వ తేదీన ఉదయం ప్రారంభం కాగా సిర్పూర్‌(టి) రేంజ్‌ పరిధిలోని మామిడిలొద్ది, గోల్యాల్‌, మొహబాన్‌లొద్ది, మాలిని,చీలెపల్లి, మడ్‌పల్లి, జీడివాగు, ఊట్లు, కేశవపట్నం, భూపాలపట్నం ప్రాంతాల్లో పక్షిప్రేమికులు సందర్శించనున్నారు. ఇవే కాకుండా బెజ్జూర్‌, పెంచికల్‌పేట్‌ ప్రాంతాల్లో తిరగనున్నారు. 9వ తేదీ సాయంత్రం వరకు అందరూ పక్షిప్రేమికలతో పాటు శాస్త్రవేత్తలు కాగజ్‌నగర్‌కు చేరుకోనున్నారు. పక్షి ప్రేమికుల కోసం అధికారులు ఉచిత భోజన సదుపాయంతో పాటు వాహన సౌకర్యం కల్పించను న్నారు. పక్షి ప్రేమికులపై అధ్యాయనం చేయ నున్నారు. కాగజ్‌ నగర్‌ డివిజన్‌లోని అడవులు పులులతో పాటు వన్యప్రాణులు అరుదైన పక్షులకు నిలయంగా మారింది. ఈ ప్రాంతాల్లో వాటికి కావల్సిన దట్టమైన అడవితో పాటు నీటి సౌకర్యం ఉంది. పెద్దవాగు ,పెన్‌గంగా జీవనదులు ఉన్నాయి. ఈ విషయమై సిర్పూర్‌(టి) ఎఫ్‌ఆర్‌ఓ పూర్ణచందర్‌ను సంప్రదించగా ఈనెల 8వ తేదీన ఉదయం బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం ప్రారంభం అవుతుందని పక్షి ప్రేమికులు కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement