Wednesday, May 22, 2024

సిటీ ఆర్ముడ్ రిజర్వ్ అడిషనల్ డిసిపిగా భీంరావు బాధ్యతలు

కరీంనగర్ – సిటీ ఆర్ముడ్ రిజర్వ్ (సిఏఆర్) అడిషనల్ డిసిపిగా యం భీంరావు శుక్రవారంనాడు బాధ్యతలు స్వీకరించారు. . కొమురంభీం ఆసిఫాబాద్ నుండి ఇక్కడకు బదిలీపై వచ్చారు. 1991లో ఆర్ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరారు. 1999లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా, 2010 లో డిఎస్పిగా, గత సంవత్సరం అడిషనల్ డిసిపిగా పదోన్నతి పొందారు. ఆర్ఎస్ ఐ పనిచేసిన కాలంలో ఆయన ముఖ్యమంత్రి భద్రత విభాగంలో పనిచేశారు. వివిధ రకాల హెూదాల్లో ఆయన ఖమ్మం, రామగుండం, ఆదిలాబాద్, కరీంనగర్,
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేశారు.

బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు, అడిషనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్ (శాంతిభద్రతలు), జి చంద్రమోహన్ (పరిపాలన)లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement