Monday, May 6, 2024

TS : కాంగ్రెస్ గూటికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం…

భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కారు దిగి ఆదివారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్రావుతోపాటు ఆయన సహచరులు కూడా హస్తం పార్టీలో చేరారు.

- Advertisement -

గతేడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్ విజయం సాధించారు. మిగిలిన 8 స్థానాల్లోనూ కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. ఇక ఇప్పుడు వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరడంతో 9 ఉమ్మడి ఖమ్మం జిల్లా హస్తం వశమైంది.

ఇక ఇప్పటికే ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement