Monday, May 6, 2024

BC Mantra – అన్ని పార్టీలు బీసీలకు 60 సీట్లు కేటాయించాల్సిందే – బిసి సంక్షేమ సంఘం డిమాండ్

.ఎల్బీనగర్ ఆగస్టు 19 (ప్రభ న్యూస్). బీసీల జనాభా దామాషా ప్రకారం వచ్చే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు 60 సీట్లు కేటాయించాలని, సామాజిక న్యాయం సబ్బండ కులాలకు రాజ్యాధికారం అనే నినాదంతో బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోవచ్చే నెల సెప్టెంబర్10న హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో 5లక్షల మందితో ”బీసీల సింహ గర్జన” భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని .బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. బిఆరెస్ పార్టీ సిట్టింగుల పేరుతో, కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల పేరుతో బీజేపీ సర్వేల పేరుతో అర శాతం, 5 శాతం ఉన్న వారికి టిక్కెట్లు కట్టబెట్టాలని చూస్తున్నాయని, ఇదే జరిగితే బీసీలంతా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిపి ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులను ఓడించి తీరుతామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.


శనివారం ఎల్బీనగర్ చింతల్ కుంట ‘పల్లవి గార్డెన్’ లో శనివారం ”బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం” నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మెమెంతో మాకoత వాటా దక్కాల్సిందేనని, అన్ని పార్టీలు సామాజిక న్యాయం పాటించి జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్ల చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ అగ్రకుల రాజకీయ పార్టీలను బీసీలంతా రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
బీసీలకు టిక్కెట్లు ఇవ్వకుండా బిసి వ్యతిరేక వైఖరి అవలoభిస్తున్న పార్టీలపై ఆయన ఫైరయ్యారు. బీసీలపై ఈ మూడు పార్టీలు ఇదే వైఖరిని అవలంభిస్తే 2023 ఎన్నికలే ఈ పార్టీలకు చివరి ఎన్నికలు కానున్నాయని, బీసీలకు ఇక తప్పని పరిస్థితిలో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశలో ఆలోచిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.


సమావేశానికి ముందు ఇటీవల మరణించిన ప్రజా గాయకుడు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో.రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ,
బిసి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సురిగి దుర్గయ్యగౌడ్,
బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్, కుంట్లరు వెంకటేష్ గౌడ్, రఘురాం నేత, కౌళ్ల జగన్నాధం, చక్రహరి రామరాజు, పర్ష హనుమాండ్లు, ఈడిగే శ్రీనివాస్ గౌడ్, నరేష్ ప్రజాప్రతి, జాజుల లింగంగౌడ్, ముద్దగౌని సతీష్ గౌడ్, బిసి మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు మనిమంజరి, వడ్లకొండ వేణుగోపాల్,
స్వర్ణగౌడ్, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement