Sunday, May 5, 2024

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ డేట్ ఫిక్స్..

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ నటుడు నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన రొమ్-కామ్‌ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ మూవీ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. మహేష్ బాబు పి. దర్శకత్వం వ‌హించ‌గా.. UV క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ ఈ మూవీని నిర్మించారు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టినుండే అందరి ఆసక్తిని ఆకర్షించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా, ఇవ్వాల ఈ సినిమా ట్రైలర్‌ను అప్డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఆగస్ట్ 21న మూవీ ట్రైల‌ర్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు. ఇక‌ ఈ మూవీని జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదల చేయనున్నట్ట ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement