Sunday, April 28, 2024

బోర్డుల సమావేశానికి ఎందుకు హాజరుకాలేదు?: టీ సర్కార్ పై బండి ఫైర్

తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాన్ని పరిష్కరించేందుకు కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేసి సమావేశానికి తెలంగాణ ఈఎన్సి ఎందుకు కాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదీజలాల పంపిణీ సక్రమంగా జరిగేలా చూసేందుకు కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నీటి సమస్యల పరిష్కారం కోసం విభజన చట్టంలోని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు నోటిఫై చేశారని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని తాను కేంద్రాన్ని కోరితే.. ఆగస్టు 5న సమావేశం ఏర్పాటు చేశారని బండి తెలిపారు. సమావేశానికి ఇరు బోర్డుల అధికారులు హాజరు అయ్యారని, కానీ తెలంగాణ అధికారులు డుమ్మా కొట్టారని మండిపడ్డారు. కేసీఆర్ నీటి విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలనుకుంటున్నారా? అన్యాయం చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అధికారులు సమావేశానికి హాజరైతే ఏపీ అక్రమ ప్రాజెక్టులపై నిలదీసే అవకాశం ఉండేదన్నారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడుకునే అవకాశం ఉండేదని చెప్పారు.

ఇది కూడా చదవండి: పూలతో మాస్క్..పెళ్లిలో వధువువరులు ఫ్లాట్ అవ్వాల్సిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement