Sunday, April 28, 2024

కూతురితో అల్లుఅర్జున్ ఆటలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అల్లు అర్హ కి సంబంధించిన ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే అల్లుఅర్జున్ షూటింగ్ సమయంలో కాస్త బ్రేక్ దొరికిన అల్లు అర్హ తో సమయాన్ని గడుపుతూ ఉంటారు.

తాజాగా అల్లుఅర్జున్ అర్హ తో గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్ కి సంబంధించిన వీడియోను అల్లుఅర్జున్ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. బన్నీ బబుల్ గన్ తో బబుల్స్ వదులుతుంటే.. వాటితో ఆడుకుంటూ అర్హ కనిపిస్తోంది. దీనిని చూసిన బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తుండగా… అల్లు అర్హ శాకుంతలం సినిమాలో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement