Tuesday, April 16, 2024

వీడియో: డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లిన బైక్..

పూణేలో వింతఘ‌ట‌ల చోటుచేసుకుంది. ఎవరి పని వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అంతలో ఎరుపు రంగులో ఉన్న ఓ బైక్ రయ్యిమంటూ రోడ్డుపై వెళుతోంది. బైక్ పై ఎవరూ లేరు. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. ఓ వ్యక్తి రోడ్డు మీదకు వచ్చి ఇతరులను అప్రమత్తం చేశాడు. డ్రైవ‌ర్ లేకుండానే ఓ బైక్ దాదాపుగా 300 మీట‌ర్లు ప్ర‌యాణం చేసింది.  వేగంగా వ‌స్తున్న బైక్ రోడ్డుపై న‌డుస్తున్న పాద‌చారుడిని డీకొట్టింది.  బైక్ న‌డుపుతున్న వ్య‌క్తి కింద‌ప‌డిన‌ప్ప‌టికీ ఆ బైక్ మాత్రం ఆగ‌లేదు.  300 మీట‌ర్ల‌మేర రోడ్డుపై ప్రయాణం చేసి ఎదురుగా వ‌స్తున్న మినీ లారీకి తగిలి కింద‌ప‌డింది.  దీనికి సంబందించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

YouTube video

ఇది కూడా చదవండి: హరిహర వీరమల్లుపైనే నమ్మకాలు పెట్టుకుంటున్న నిధి

Advertisement

తాజా వార్తలు

Advertisement