Thursday, May 16, 2024

Exclusive | బీఆర్ఎస్​కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్​లోకి మామా, కోడలు!

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇతర పార్టీల్లోని కీలక నేతలను ఆకర్షించేందుకు ఎత్తులు వేస్తున్నాయి. వారి అవకాశాలను సాకారం చేసేలా హామీలిస్తూ చేరికల జోష్​ కొనసాగిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్​ కాస్త ముందంజలో ఉండగా.. బీజేపీ అదే తొవ్వలో పోతోంది.

ఇక.. బీఆర్ఎస్ కీలక నేత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్​పర్సన్ అనితారెడ్డితో కలిసి కాంగ్రెస్​ గూటికి చేరేందుకు అంతా సన్నద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డితో ఈ మేరకు తీగల కృష్ణారెడ్డి భేటీ అయినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement