Sunday, May 5, 2024

చేప ఆకారంలో జన్మించిన వింత శిశువు

హైదరాబాద్ లో వింతశిశువు జన్మించింది. తల మొండెం వరకు సాధారణ రూపం కలిగి…మోడెం కింద భాగం కాళ్ళు రెండూ కలిసిపోయి చేప ఆకృతిలో ఉన్న శిశువు ప్రసవించింది. అయితే ఆ పసికందు పుట్టిన రెండుగంటల్లో మరణించింది. సంగారెడ్డి కి చెందిన ఒక మహిళ హైదరాబాదులోని నయాపూల్ ప్రసూతి ఆస్పత్రిలో వింత శిశువుకు జన్మనిచ్చింది. శిశువు చెవి తో పాటు చేతివేళ్లు కూడా సక్రమంగా అభివృద్ధి చెందలేదు. రెండు కాళ్ళు కలిసిపోయి చేప ఆకృతిలో బిడ్డ పుట్టింది. ప్రసవించిన శిశువు రెండు గంటల్లోపే మరణించింది ఆ బిడ్డ. ఈ సంఘటనపై గాంధీ ఆసుపత్రి ప్రసూతి విభాగం వైద్యురాలు మహాలక్ష్మి మాట్లాడుతూ క్రోమోజోముల విశ్లేషణతో పాటు ఇన్ఫెక్షన్ల ప్రభావం కూడా ఉండి ఉంటుందని, ఈ లోపంగురించి తెలుసుకునేందుకు ప్లసంటా(మాయ)ని పరీక్ష కేంద్రానికి పంపినట్లు వైద్యులు తెలియజేశారు. కొన్ని సందర్భాల్లో మేనరికం వల్ల కూడా ఇలాంటి బిడ్డలు పుట్టే అవకాశం ఉందన్న వైద్యులు.. కొన్నిసార్టు ఇలాంటి విషయాలు స్కానింగ్లో 20 శాతం వరకు కనపడకపోవచ్చునని వైద్యులు అంటున్నారు. అయితే శిశువు జన్యు లోపం వల్ల అలా పుట్టి ఉంటుందన్న డాక్టర్లు.. పూర్తి పరిశోధన తర్వాత వివరాలు తెలియచేస్తా మన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement