Saturday, May 4, 2024

ఇకపై డ్రైవర్ తాగినా వాహనంలోని ప్రయాణికులపైనా కేసులు

హైదరాబాద్: కారుల్లో ప్రయాణించేవారికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ కలిగించే న్యూస్ చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తాము మరింత కఠినంగా వ్యవహరిస్తామని వారు ప్రకటించారు. మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు.. ఇకపై తాగి వాహనం నడిపేవారినే కాకుండా.. ఆ వాహనంలో ప్రయాణించేవారిపైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని నిర్ణయించామన్నారు. దీంతో క్యాబుల్లో ప్రయాణించేటప్పుడు క్యాబ్ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికినా.. అందులో ప్రయాణించేవారు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

ఈ మేరకు సోషల్ మీడియాలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ పోస్టు పెట్టారు. ‘మీ డ్రైవర్, లేదంటే మీ స్నేహితుడు పరిమితికి మించి మద్యం తాగి కారు నడుపుతున్నాడా? పక్క సీట్లో మీరు కూడా ఉన్నారా? పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే జైలుకు వెళ్లక తప్పదు’ అని ఆ పోస్టులో హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement