Monday, April 29, 2024

హైదరాబాద్​లో ఆటోల డ్రాగ్​ రేసింగ్​.. బెట్టింగులు పెడుతున్నఅక్రమార్కులు

తెలంగాణలోని హైదరాబాద్‌లో  ఆటోల రేసింగ్​ జరుగుతోంది. నిన్న రాత్రి డ్రాగ్ రేస్‌లో కొన్ని ఆటోలు పాల్గొనడం సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.. సిటీలోని సౌత్ జోన్‌లో ఉన్న సంతోష్ నగర్ పిసల్ బండ క్రాస్‌రోడ్ నుండి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్ మధ్య ఈ డ్రాగ్ రేస్ జరిగింది.ఈ ఘటన మొత్తం కెమెరాలో చిక్కడంతో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

 ప్రతి రోజు రాత్రి వేళ ఇలాంటి ఆటోల పందేలు నిర్వహిస్తూ రోడ్లపై గందరగోళం సృష్టిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. పందేల సమయంలో కూడా బెట్టింగ్‌లు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమార్కులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. సీసీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీ ఆధారంగా పోలీసులు అక్రమార్కుల కోసం వెతుకుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement